ఎన్సీసి వార్షిక శిక్షణ శిబిరం ప్రారంభించిన దానకిషోర్‌

నవతెలంగాణ-ఓయూ
సైఫాబాద్‌లోని ఓయూ యూనివర్శిటీ కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌లో మంగళవారం నుంచి జూన్‌ 6 వరకు పది రోజుల పాటు జరిగే ఎన్‌సీసీ వార్షిక శిక్షణా శిబిరాన్ని 3వ తెలంగాణ బెటాలియన్‌ ఎన్సీసి కమాండింగ్‌ ఆఫీసరు లెఫ్టినెంట్‌ కల్నల్‌ శరత్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఇన్‌చార్జ్‌ వీసీ, ఐఏఎస్‌ దాన కిషోర్‌ ముఖ్య అతిథిగా హాజరై ఎన్‌సీసీ క్యాడేట్లు అందించిన గౌరవ వందనం స్వీకరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గౌరవ అతిథిగా ఓయు రిజిస్ట్రార్‌ ప్రొ. పి. లక్ష్మీనారాయణ, ప్రిన్సిపాల్‌ ప్రొ. లక్ష్మణ్‌ నాయక్‌ హాజరయ్యారు. ముఖ్య అతిథి దాన కిషోర్‌ మాట్లాడుతూ. హెచ్‌ఎండీఏ ఆవరణలో ఎన్సీసీ క్యాంపులు నిర్వహిస్తే వాటికి మౌళిక వసతులు కల్పించడంలో, అభివద్ధికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.ఎన్సీసి యూనిఫాం ధరించిన విద్యార్థులు భాధ్యత కల్గిన భావిభారత పౌరులుగా ఎదగాలన్నారు. కళాశాల అభివద్ధి కి సంబంధించి కాలేజ్‌ బార్సు హాస్టల్లో ఓపెన్‌ జిమ్‌, పీజీ బ్లాక్‌ వద్ద గ్రీనరీని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. లేడీస్‌ హాస్టల్‌, కాలేజీ క్యాంపస్‌లో డ్రయినేజీ బ్లాకేజీ సమస్యలపై నిధులు మంజూరు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కళాశాలలోని ప్రయోగశాలలకు నిధులు మంజూరు చేసే దిశగా సహకరిస్తాన న్నారు. 3(టీ) బెటాలియన్‌ నిర్వహించే ఈ క్యాంపులో పాల్గొన్న క్యాడెట్లను అభినందించారు. ప్రొ. పి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ క్యాడెట్లను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్న ప్రిన్సిపల్‌ ప్రొ. జె. లక్ష్మణ్‌ నాయక్‌ను ప్రశంసించారు. క్యాడెట్లకు ఇటువంటి అవకాశం కల్పించినందుకు, వసతి కల్పించినందుకు ఓయూ కి లెఫ్టినెంట్‌ కల్నల్‌ శరత్‌ కృతజ్ఞతలు తెలిపారు. క్యాంపునకు సంబం దించిన ఏర్పాట్లు చేసిన ఎన్‌సీసీ అధికారి డాక్టర్‌ నరేష్‌ను అతిథులు, ప్రిన్సిపాల్‌ అభినందించారు.

Spread the love