ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం

టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రంజిత్‌ కుమార్‌
నవతెలంగాణ-జనగామ
ఉపాధ్యాయ,విద్యారంగాల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ, మా టలతో మభ్యపెడుతుందని, చేతలు శూన్యమని టీఎస్‌ యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్‌ కుమార్‌ విమర్శించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి న ర్సిరెడ్డి హైద్రాబాద్‌లో చేస్తున్న నిరసన దీక్షకు మద్దతుగా శనివారం జనగామ జి ల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది.అనంతరం ఆసంఘం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రంజిత్‌ కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా రంగం పట్ల ప్రభుత్వానికి సరైన దక్పథం లేదని 8 సంవత్సరాలు అయినా ప్రమోషన్స్‌ లేవని, 5 సంవత్సరాలుగా బదిలీలు లేవని, కేవలం ఆర్థికపరమైన అంశంగానే చూస్తుంది తప్ప, విద్యలో నాణ్యత పెరుగుతుం దనే ఆలోచన లేదని, మోడల్‌ స్కూల్స్‌ ప్రారంభం అయినప్పటినుండి ఇప్పటివరకు ప్రమోషన్స్‌ కానీ బదిలీలు కానీ నిర్వహించలేదని విమర్శించారు. వేతనాలు అంద జేయడంలో కూడా అలసత్వం ప్రదర్శిస్తూ 10నుండి 15 వరకు కూడా వేతనాలు రాని దుస్థితి నెలకొందని, ఉద్యోగులు దాచుకున్న సొమ్మును వారి అవసరాలకు ఇవ్వకుండీ ఈ కుబేర్‌లో పెండింగ్‌లో పెడుతుందని వెంటనే మార్చ్‌ వరకు ఉన్న పెండింగ్‌ బిల్స్‌ అన్నింటినీ వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కేజీబీవీ యు ఆర్‌ఎస్‌లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు మినిమం బేసిక్‌ పే ప్రకారం వే తనాలు చెల్లించాలని కోరారు. ఉపాధ్యాయ, విద్యా రంగ వికాసం కొరకు ఉపాధ్యా య ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అనేక పర్యాయాలు ప్రాతినిధ్యాలు చేసిన ప్పటికి ని స్పందించని ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఒక్క రోజు నిరసన దీక్ష చేపట్టారని, వారి దీక్షకు మద్దతుగా అన్ని జిల్లా కేంద్రాలలో నిరసనలు జరుగుతున్నాయని, ప్ర భుత్వం మొద్దు నిద్రవీడి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్య క్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాసరావు, కోశాధికారి సుధాకర్‌, జి ల్లా కార్యదర్శులు చిక్కుడు శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు, వివిధ మండలాల బాధ్యులు క నకయ్య, నాగరాజు నీలకంఠం, జంపయ్య, గోవర్ధన్‌ రెడ్డి, ఆగయ్య, ఉప్పలయ్య, మ హేష్‌, రవీందర్‌, నర్సింహులు, ఉప్పలయ్య, సురేష్‌ బాబు, సయీద్‌, వనం నర్సిం హులు, రవి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love