పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న నేస్తం సొసైటీ

– మృతురాలి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేత
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
పేద కుటుంబాలకు అనునిత్యం అండగా ఉంటూ నేస్తం సొసైటీ  మానవత్వాన్ని చాటుకుంటుంది. బుధవారం హుస్నాబాద్ మండలంలోని కూచనపల్లి గ్రామానికి చెందిన  జేరిపోతుల మల్లవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా నేస్త సొసైటీ సభ్యులు 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ  సొసైటీ అడ్వైజర్, “ప్రముఖ జర్నలిస్ట్ మడప రాజిరెడ్డి సహకారంతో సొసైటీ ముందుకు వెళుతుందని సొసైటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  డీసీసీ కార్యదర్శి మడప యాదవ రెడ్డి ,నేస్తం సోషల్ సర్వీస్ సొసైటీ సభ్యులు బండి వంశీ, నమిలికొండ శ్రావణ్, నిమ్మకంటి కార్తిక్ ,మంద జానకి రామ్ రెడ్డి లు పాల్గొన్నారు.
Spread the love