
పట్టణంలోని ఈ ఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్ కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ బాదం రాజ్ కుమార్ ప్రముఖ సీడ్ ఆర్గనైజర్ మారం పల్లి సాయి రెడ్డి ,అర్గుల్ సురేష్ ,లెక్చరర్ ఉప్లూర్ వెంకట్, ఆఫిస్ స్టాఫ్ సౌమ్య, దర్మవీర్ తదితరులు పాల్గొన్నారు.