నవతెలంగాణ- కంటేశ్వర్: నిజామాబాద్ పట్టణంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొని వారి మద్దతు సోమవారం కోరారు.ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్షుడే దళితుడు, మాదిగల ఆగ్రహం చవిచూస్తే ఏరాజకీ పార్టీకైన అధికారం పగటి కలే అవుతుందని, ఇంద్ర గాంధీ హయాంలోనే దళితులకు గుర్తింపు దొరికింది. కాంగ్రెస్ దళితుల అభ్యున్నతికి పనిచేస్తుంది. దళితుల ఓట్ల కోసం బీజేపీ బూటకమైన నాటకమాడుతుంది. ళితులకు కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది. తెలంగాణ వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తానని లేకపోతే తలనర్క్కుంటా అన్నాడు. దళిత బంధు పెట్టి దళితుల్లో కొట్లాటలు పెట్టాడు.దళితులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని వారికి పూర్తి అన్యాయం జరిగిందన్నారు. డాక్టర్ అంబేద్కర్ అంటరాని జాతులన్నీ ఐక్యతతో ఉండాలన్నరు కలిసి పోరాటాలు చేసి ఎస్సి కులాలు విచ్చిన్నం కాకూడదని అన్నారు. దళిత జాతి రాజకీయ అధికారంలోకి వస్తే మనువాదులు జీర్ణించుకోలేరు. ఈ రోజుల్లో కూడా దళిత రాష్ట్రపతిని గుడిలో కూడా రానివ్వకుండా అవమాన పరిచిన బీజేపీ ఇప్పుడు దళితులకు ఏం న్యాయం చేస్తుంది. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో మాదిగ ఓటు బ్యాంకు ను రాబట్టుకోవడం కోసం బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్ని కుట్రలు చేసినా దళితులు కాంగ్రెస్ తోనే ఉంటారన్నారు. పది సంవత్సరాల్లో ఒక్కసారి కూడా గద్దర్ను కలవని ముఖ్యమంత్రి.అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రూపుమాపాలని చూస్తున్న బీజేపీ బీఆర్‌ఎస్ లను బొంద పెట్టాలి. రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటున్న మూర్ఖుడు నరేంద్ర మోడీ. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే దళితులకు సముచిత న్యాయం జరుగుతుంది. కావున నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజలు తమ అమూల్యమైన ఓటును వేసి తనను గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు.