నవతెలంగాణ-డిచ్ పల్లి : వైస్‌ఎంపీపీ కులాచారి శ్యాంరావుపై ఎంపీటీసీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాణం నెగ్గింది. సోమవారం డిచ్ పల్లి మండల పరిషత్ కార్యాలంలో నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ ఆధ్వర్యంలో అవిశ్వాస సమావేశం నిర్వహించారు. మొత్తం 17 మంది ఎంపీటీసీల కు గానూ 13 మంది సమావేశానికి హాజరయ్యారు. కోరం ఉండటంతో ఆర్డీవో అవిశ్వాస బలపరీక్ష నిర్వహించారు. వైస్ ఎంపీపీ శ్యాంరావుకు వ్యతిరేకంగా 13 మంది ఎంపీటీసీలు చేతులు పైకెత్తడంతో అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీవో ప్రకటించారు. అనంతరం ఆర్డీవో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 8న ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ గద్దె భూమన్న, వైస్ ఎంపీపీ కులాచారి శ్యాంరావు లపై వేర్వేరుగా అవిశ్వాస తీర్మాణం అందజేసినట్లు తెలిపారు. దీనిపై ఈ నెల 29న ఉదయం 10.30 గంటలకు ఎంపీపీపై, 11.30 గంటలకు వైస్‌ఎంపీపీ పై అవిశ్వాస సమావేశాలకు నిర్ణయిస్తూ తాను సభ్యులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అయితే ఎంపీపీ గద్దె భూమన్న సమావేశం పై హైకోర్టు స్టే తీసుకురావడంతో ఉదయం 10.30 గంటలకు జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేశామన్నారు. వైస్ ఎంపీపీపై అవిశ్వాస సమావేశాన్ని 11.30 గంటలకు కోరం ఉండటంతో నిర్వహించామన్నారు. ఇందులో మెజార్టీ ఎంపీటీసీలు అవిశ్వానికి అనుకూలంగా ఓటు వేశారని దీంతో అవిశ్వాసం నెగ్గినట్లు ప్రకటించా మన్నారు. ఈ నివేదికను కలెక్టర్ కు అందజేస్తామని ఆర్డీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో డిచ్ పల్లి ఎంపీడీవో టీవీఎస్ గోపిబాబు, ఎంపీటీసీ లు చిన్నోల్ల నర్సయ్య, దండుగుల సాయిలు, ఉగ్గెర కృష్ణవేణి, పులి నర్సింగ్‌రావు, చాకటి రాజమణి, కుర్రి సవిత, దుంపాల సౌమ్య, గండోల్ల సుప్రియ, బాలగంగాదర్, పోతర్ల సుజాత, రాథోడ్ బిక్యా, సాంపల్లి గోదావరి, అప్పాల మంజుల తదితరులు పాల్గొన్నారు.