స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు..

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లో స్పా సెంటర్ల మాటున అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఇలాంటి వాటిపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు తాజాగా మరోమారు స్పా సెంటర్లపై దాడులు నిర్వహించారు. అమృత హోటల్ స్పా సెంటర్‌పై దాడులు నిర్వహించిన పోలీసులు అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు గుర్తించారు. స్పా సెంటర్ యజమానులపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. స్పా పేరుతో సెంటర్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతోనే ఈ దాడులు నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు.

Spread the love