ఉత్తర తెలంగాణ జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి

– రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎస్‌ శాంతికుమారి అత్యవసర సమావేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, సంబం ధిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉం డాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఉమ్మడి మెదక్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందనీ, దక్షిణ తెలంగాణ జిలాల్లో ఒక మోస్తరు వర్షం ఉంటుందని ఆమె తెలిపారు.
అందువల్ల అత్యవసర పరిస్థితుల్లో, సహాయపడేందుకు వీలుగా వరంగల్‌, ములుగు, కొత్త గూడెం జిల్లాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందా లను అందుబాటులో ఉంచామని వివ రించారు. హైదరాబాద్‌లోనూ 40 మందితో కూడిన ఒక బందం సిద్ధం గా ఉందని సీఎస్‌ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏవిధమైన నష్టం వాటిల్లలేదని, ముఖ్యంగా చెరువులు, కుంటలకు నష్టం వాటిల్లలేదని, గ్రామీణ ప్రాంతాలలో రహదారుల పరిస్థితి కూడా మెరుగ్గానే ఉందని వివరించారు. భారీ వర్షాల నేపథ్యం లో చేపట్టాల్సిన అత్యవసర చర్యలపై సీఎస్‌ గురువారం హైదరాబాద్‌లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లోనూ 50 శాతం నీటి నిల్వలు మాత్రమే ఉన్నందున భారీ వరద వచ్చినా ఇబ్బందిలేదని అన్నారు.
అన్ని రిజర్వా యర్లు, చెరువుల వద్ద ముందు జాగ్రత్త చర్యలను చేపట్టినట్టు ఆమె తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి 41.3 అడుగుల మేర ప్రవహిస్తున్నదని, రాత్రికి ఒకటో ప్రమాద సూచీ జారీ అయ్యే అవకాశం ఉందని, అప్రమత్తం గా ఉండాలని సూచించారు. సమా వేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్య దర్శులు అధర్‌ సిన్హా, రజత్‌ కుమార్‌, సునీల్‌ శర్మ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, సింగ రేణి సీఎండి శ్రీధర్‌, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘు నందన్‌ రావు, అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ శాఖ డీజీ నాగిరెడ్డి, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, సమాచార శాఖ స్పెషల్‌ కమిషనర్‌ అశోక్‌రెడ్డి, ఈఎన్‌ సీ గణపతి రెడ్డిలతోపాటు ట్రాన్స్‌కో, నీటిపారుదల, పంచా యితీరాజ్‌, రోడ్లు భవనాల శాఖల ఈఎన్‌సీలు పాల్గొన్నారు.

Spread the love