సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం), దాని భాగస్వామ్య సంఘాలు, ఎనిమిది పర్యాయాలు లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైన హన్నన్ మొల్లాను, ఏడాదికిపైగా నడిచిన రైతుఉద్యమంలో కీలక వ్యక్తిగా గుర్తించాయి. భారతదేశంలోనే అతిపెద్ద రైతు సంఘమైన ఆలిండియా కిసాన్ సభకు ఆయన ఆఫీస్‌బేరర్. ఏడాదికాలం పాటు కొనసాగిన నిరసనల్లో 700 పైగా రైతులు తమ ప్రాణాలు కోల్పోయారు. మూడు వివాదాస్పద రైతుచట్టాల్ని రద్దు చేయడంలో ఎస్‌కేఎం విజయం సాధించింది. కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేసే మార్గాల్ని చర్చించేందుకు, హామీ ఇచ్చే విధంగా సేకరణ హామీకి ఉద్దేశించబడిన కమిటీని కూడా ప్రభుత్వంతో ఏర్పాటు చేయించింది.
‘ఫ్రంట్ లైన్’ ప్రతినిధి టీ.కే.రాజ్యలక్ష్మికిచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఉద్యమంపై అనేక అంశాలు వివరించారు. విషయ ప్రాధాన్యత రీత్యా దాన్ని పాఠకులకు అందిస్తున్నాం –సంపాదకుడు.
ఫ్రంట్ లైన్: ప్రస్తుత రైతు ఆందోళన దశను మీరెలా చూస్తారు?
హన్నన్ మొల్లా: స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడానికి ప్రభుత్వం తిరస్కరించినపుడు, దేశ వ్యాప్తంగా ఉన్న 500 రైతు సంఘాలు అక్టోబర్ 2020లో సమస్య ఆధారిత ఉద్యమం ప్రారంభిం చాయి. మూడు వ్యవసాయ చట్టాల రద్దు తక్షణ సమస్య. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులపై ఆధార పడి కనీసమద్దతు ధరకు చట్టబద్ధ మైన హామీ పొంద డమనేది మరో ముఖ్యమైన డిమాండ్. పెట్టుబడి ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. పెట్టు బడి ఖర్చుల అదుపుకు హామీ ఇవ్వాల్సింది ప్రభు త్వమే. వ్యవసాయం ఇతర పరిశ్రమల లాంటిది కాదు. ఇతర ఉత్పత్తులకు గరిష్టంగా రిటైల్ ధర ఉంటుంది. అంతకుమించి ఎవరూ చెల్లింపులు చెయ్యకూడదు. మేం కేవలం కనీస మద్ధతు ధర, సేకరణ హామీ కోసం మాత్రమే అడుగుతున్నాం. ఈ ఏడాది మేం ఫిబ్రవరి 16న గ్రామీణ బంద్‌ను నిర్వహిం చాలని పిలుపునిచ్చాం, కానీ కొన్ని రైతు గ్రూప్‌లు ముందు కెళ్ళి ఫిబ్రవరి 13న ఢిల్లీ చలోకు పిలుపు నిచ్చాయి.
కనీస మద్ధతు ధర కోసం ఒక చట్టబద్ధమైన చట్రం ఏర్పాటు చేయాలనేది మా మొదటి డిమాండ్. ఇది 20 ఏండ్లుగా మేం చేస్తున్న డిమాండ్. భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో, తన ఎన్నికల ప్రణాళికలో సైతం తాను స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తానని చెప్పింది. చట్టాల్ని ఉపసంహరించుకునే తన ఉద్దేశ్యాన్ని ప్రభుత్వం ప్రకటించినప్పుడు మేము తిరిగి ధర్నాకు వెళ్ళాం. పదకొండు రోజుల తర్వాత ప్రభుత్వం మమ్ముల్ని ఒక సమావేశానికి పిలిచింది, అక్కడ ఇతర డిమాండ్లను చర్చించారు. ఏడవ డిమాండ్ – లఖీంపూర్ ఖేరీలో నలుగురు రైతుల మరణంలో పాత్రను పోషించిన హోంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా తేనీ ని బర్తరఫ్ చెయ్యాలి.
వ్యవసాయ శాఖామంత్రితో రాతపూర్వకంగా చేసుకున్న ఒప్పందంలో ఆరు డిమాండ్లు భాగంగా ఉన్నాయి. మూడేండ్లు గడిచిపోయాయి కానీ ప్రభుత్వం మాతో చేసుకున్న ఒప్పందం అమలు ప్రక్రియలో ఒక అంగుళం కూడా ముందుకు వెళ్ళలేదు. గతేడాది మార్చి నెలలో రామ్ లీలా మైదానంలో నిర్వహించిన ఒక పెద్ద ప్రదర్శనలో ఈ ఒప్పందం గురించి ప్రభు త్వానికి గుర్తుచేశాం. గవర్నర్ల కార్యాలయాల ముందు 72 గంటల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిం చాం. జనవరి 26,2023 నాడు దేశ వ్యాప్త ంగా ట్రాక్టర్ల ప్రదర్శనను నిర్వహించాం. ఫిబ్ర వరి 16,2024న మా చివరి కార్యాచరణ గ్రా మీణ బంద్‌ను, ఫిబ్రవరి 26న ట్రాక్టర్ల ప్రదర్శనను నిర్వహించాం, ఈ రెండు కార్యక్ర మాలు కూడా చాలా శాంతియుతంగా జరిగా యి.
కేంద్ర కార్మిక సంఘాలు ఫిబ్రవరి 16 పిలుపు కు మద్ధతు పలికాయి. మేమెలాంటి కొత్త డిమాండ్లను అదనంగా చేర్చలేదు. బంతి ఇప్పటికీ కూడా ప్రభుత్వ కోర్టులోనే ఉంది. మా నిరసన విధానం ఎప్పుడూ క్రమశిక్షణతో, ప్రజాస్వామికంగా, శాంతియుతంగానే జరుగుతుంది. మాకు ఒక జాతీయ కమిటీ ఉంది, ప్రతీ మూణ్ణెళ్ళకోసారి ఒక జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది. ఎస్‌కేఎం ఒక సజీవమైన ఉద్యమం. అందువల్లనే మేం ప్రజల నుంచి విశాలమైన మద్దతును పొందుతున్నాం.
విభజించు, పాలించు అనే ప్రభుత్వ ఆటతో రైతు ఉద్యమం చీలిపోయిందని మీరు భావిస్తున్నారా?
ఏడాదిపాటు నడిచిన మా నిరసన కార్యక్రమాల తరువాత ఎస్‌కేఎం నుండి ఇద్దరు నాయకులు వెళ్లి పోయారు. వారిలో ఒకరికి ఆర్‌ఎస్‌ఎస్‌తో చాలా సన్నిహితమైన సంబంధాలున్నాయి. మాకేమీ అభ్యంతరం లేదు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే, ఈ ఇద్దరు నాయకుల ప్రాతినిధ్యంలో ఏర్పడిన కొన్ని విభాగాల గ్రూపులతో సంప్రదింపులు జరపడానికి ప్రభుత్వం సిద్ధపడి, ఎస్‌కేఎం ప్రాతినిధ్యంలో ఉన్న పెద్ద అఖిల భారత కమిటీని అడ్డుకుంది. అఖిల భారత రైతు మరియు కిసాన్ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 40 మంది మాలో ఉన్నారు. మొత్తంగా 2020-21లో మేం పదకొండుదఫాలుగా ప్రభుత్వం తో చర్చలు జరిపాం. ఆ తర్వాత మూడేండ్ల పాటు మమ్ముల్ని చర్చలకు పిలువలేదు కానీ విడిపోయిన గ్రూపులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ముగ్గురు మంత్రుల్ని చండీఘర్ పంపింది. ప్రభుత్వ పన్నాగంలో చిక్కుకోవద్దని మేము ఆ సంఘాల వారిని హెచ్చరిం చాం. అందుకే, ప్రభుత్వ నిబంధనల్ని అంగీకరించిన తర్వాత వెంటనే ఇవ్వజూపిన (ఆఫర్) దానిని వెంటనే తిరస్కరించారు. ప్రాథమిక సమస్యల్ని పరిష్కరించ లేదు. మీడియా కూడా మా శాంతియుతమైన నిరసన విధానాల్ని పట్టించుకోలేదు.
ప్రస్తుత దశకు నాయకత్వం వహిస్తున్న వారు కూడా తమను తాము ఎస్ కేఎంగానే పిలుచుకుం టున్నారు కానీ ”రాజకీయేతర” అనే పదాన్ని అదనంగా జోడిస్తున్నారు.
”రాజకీయేతర”గా పిలువబడేది ఏదీ లేదు. అది ప్రజల్ని మోసం చేస్తుంది.ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించే ఒక రాజకీయ అస్తిత్వంతో మేం రాజకీయ రహితంగా ఎలా పోరాడగలం? మా డిమాండ్లే, మా రాజకీయం.
కానీ ”పార్టీ” రాజకీయం కాదు. ఎస్ కేఎం ఓ రాజకీయ సంస్థ కాదు. ఔను, మేం అప్పటికే అఖిల భారత గ్రామీణ బంద్‌ను నిర్వహించాలని సమిష్టిగా కార్యా చరణ ప్రణాళికను రూపొందించుకున్నాం కాబట్టి మేము ”ఢిల్లీ చలో” పిలుపుకు దూరంగా ఉన్నాం, ఇది వాస్తవం.
కానీ ఎలాంటి వారైనా నిరసన వ్యక్తం చేసే హక్కును కలిగి ఉండడాన్ని మేం సమర్థిస్తాం. ఒకవేళ ప్రభుత్వం రైతుల పై దాడులు చేస్తే మేము ఖచ్చితంగా ఖండిస్తామనేది కూడా స్పష్టం చేస్తున్నది.
వ్యవసాయాధారిత వ్యవసాయాన్ని నాశనంచేసి, కార్పోరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సాహించడమే ప్రభుత్వ విధా నం. మూడు వ్యవసాయ చట్టాల్ని ఉపసంహ రిం చుకున్నారు కానీ ఆ చట్టాల సారం మాత్రం బడ్జెట్‌లో యధావిధిగానే ఉంది. వ్యవసాయం లో కార్పొరేట్ పెట్టుబడి 3 శాతం మాత్రమే. అలాంటి కొద్ది మొత్తం పెట్టుబడితో కార్పొరేట్ రంగం మొత్తం అదుపు చేయాలనుకుంటోంది.
(”ఫ్రంట్ లైన్” సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్, 9848412451
హన్నన్ మొల్ల