గ్రూప్‌ సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ విభాగాల్లో ఉన్న లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌, జూనియర్‌ సెక్రటరియేట్‌ అసిస్టెంట్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు సోమవారం స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. అర్హత, ఫీజు చెల్లింపు తదితర వివరాల కోసం కమిషన్‌ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు జూన్‌ ఎనిమిది వరకు గడువుండగా, అదే నెల 10 వరకు ఫీజు చెల్లించవచ్చు.

Spread the love