
మండలంలోని కాటేపల్లిలో గ్రామ పంచాయతీ నిర్మాణం స్థలం పరిశీలించిన పంచాయతీ రాజ్ డిప్యూటి ఇంజనీర్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాటే పల్లి గ్రామంలో పంచాయతీ నూతన భవనం నిర్మాణం నిధులు ఉపాధి హామీ పథకం ద్వారా 20 లక్షల రూపాయలు మంజూరు కావడంతో సోమవారంనాడు భావన నిర్మాణ స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతి రాజ్ జేఈ. శ్రీకాంత్ రెడ్డి, డిపిటిమధు బాబు, గ్రామస్థులు మల్లప్ప పటేల్, మొగుల గౌడ్, మోహిద్దీన్, ఇస్మాయిల్, తది తరులు పాల్గొన్నారు.