తెల్ల కాగితం మీద రాసిస్తే అధికారులు డబ్బులు ఇస్తారు..

– అమాయకురాలును మోసం చేసి బంగారం నాగులు దొంగతనం
నవతెలంగాణ-రెంజల్ : రెంజల్ మండలం నీల గ్రామానికి చెందిన అంబం పోసాని వద్దనున్న 12 గ్రాముల బంగారు నాగులను గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించాడని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. ఆయన అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నీలా గ్రామం శివాజీ నగర్ కాలనీకి చెందిన అంబం పోసాని ఇంటికి నల్లని బైకుపై గుర్తు తెలియని వ్యక్తి వచ్చి గరీబోళ్లకు అధికారులు డబ్బులు అందజేయనున్నట్లు తెలిపాడని, మీ ఇంట్లో తెల్ల కాగితం ఉంటే ఇవ్వండి దానిపై రాసిస్తే అధికారులు వచ్చి తమకు డబ్బులు ఇస్తారని నమ్మబలికాడు, అంబం పోసానికి కొడుకు, కోడలు పొలం పనులకు వెళ్ళగా, తన మనమరాలు అర్చనతో ఇంట్లో ఉండగా ఆయన వచ్చి మనమరాలకు తెల్ల కాగితాలు తీసుకురావాలని 50 రూపాయల నోటు ఇచ్చి పంపాడు. వృద్ధురాలి చెవులకు నాగులు చూసి బంగారం ఉందని తెలిస్తే అధికారులు డబ్బులు ఇవ్వరని, వాటిని ఒక కవర్లో పెట్టి దేవుడి వద్ద ఉంచుతారని వృద్ధురాలును నమ్మించి బయటకు వెళ్లాడని, ఇది గమనించిన వృద్ధురాలు దేవుడు వద్దకు చూడగా అక్కడ బంగారం కనిపించలేదని చుట్టుపక్కల వారికి సమాచారాన్ని అందించింది. గుర్తుతెలియని వ్యక్తి నల్ల షర్టు నల్ల ప్యాంట్ ధరించి ఉన్నాడని సుమారు 30 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటాడని ఆమె పేర్కొంది. చుట్టుపక్కల గాలించిన ఆ వ్యక్తి కనబడకపోవడంతో వృద్ధురాలు స్థానిక పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసింది. వాటి విలువ సుమారు 30 వేల రూపాయల వరకు ఉంటుందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సై ఉదయ్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Spread the love