ఆయిల్ ఫాం క్షేత్రాలకు వేసవిలో నీటి తడులు ఎక్కువగా ఇవ్వాలి: ఆయిల్ ఫెడ్ డి.ఒ బాలక్రిష్ణ 

నవతెలంగాణ – అశ్వారావుపేట
పామాయిల్ తోటలు సాగు చేస్తున్న రైతులు వేసవి దృష్ట్యా నీటి తడులు ను ఎక్కువగా ఇవ్వాలని ఆయిల్ ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ సూచించారు. తరుచూ నీటి తడులు ఇవ్వకుంటే గెలలు దిగుబడులు తగ్గుతాయని చెప్పారు. స్థానిక కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.ఇప్పటికే ఆయిల్ ఫాం గెలలు దిగుబడి తక్కువగా ఉందని, నీటి తడులు ఎక్కువగా ఇవ్వక పోవటం తో గెలలు ఉత్పత్తి తగ్గుతుందని చెప్పారు. దీని ప్రభావం రైతులు ఆర్థిక నష్టంపై ఉంటుందని హెచ్చరించారు. అదేవిధంగా పోడు పట్టా దారులతో పాటు పాత భూమి హక్కు పత్రాలు ఉన్నా రాయితీ పధకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. కొత్తగా ఆయిల్ ఫాం సాగు చేసే రైతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Spread the love