డిసెంబర్ 31న 110 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు ..

110 drunk and drive cases registered on December 31.– జిల్లా ఎస్పీ సింధు శర్మ ..
నవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి జిల్లా పోలీసులు డిసెంబర్ 31 సందర్భంగా మంగళవారం బుధవారం నిర్వహించిన  డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లో భాగంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 110 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు, 66 వెహికల్స్ సీజ్ చేయడం జరిగిందనీ జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కామారెడ్డి సబ్ డివిజన్లో 60 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు,  ఎల్లారెడ్డి సబ్ డివిజన్లో 28  డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు,  బాన్సువాడ సబ్ డివిజన్లో 22 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, కామారెడ్డి జిల్లా  వ్యాప్తంగా  66 వెహికిల్స్   సీజ్ చేయడం జరిగిందన్నారు. ఇకపై ఎవరు మద్యం త్రాగి వాహనాలు నడపరాదని,  రహదారి భద్రతా నియమ నిబంధనలను పాటించి ఈ సంవత్సరం  రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గే విధంగా  పోలీసు శాఖ వారు  తీసుకునే చర్యలలో ప్రజలు సహాయ సహకారాలు అందించాలని ఆమె ప్రజలను కోరారు.
Spread the love