ఆధునిక డిజైన్లతో వన్ గ్రామ్ గోల్డ్ మార్కెట్ ప్రభావితం చేస్తుంది: సీతక్క

నవతెలంగాణ-గోవిందరావుపేట
ఆధునిక టెక్నాలజీ సహాయంతో అనేక రకాల డిజైన్లతో వన్ గ్రామ్ గోల్డ్ ప్రస్తుత మార్కెట్ను విస్తృతంగా ప్రభావితం చేస్తుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గురువారం మండలంలోని పసర గ్రామంలో జాతీయ రహదారి వెంట లక్ష్మీ వన్ గ్రామ్ గోల్డ్ షాపును ఎమ్మెల్యే సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ వన్ గ్రామ్ గోల్డ్ విభాగంలో లేటెస్ట్ టెక్నాలజీతో అనేక రకాల డిజైన్లు మార్కెట్లోకి వస్తున్నాయన్నారు. అసలు గోల్డ్ కన్నా వన్ గ్రామ్ గోల్డ్ నగలు మార్కెట్లో జిగేలు మంటున్నాయని అన్నారు. వన్ గ్రామ్ గోల్డ్ నగలను మహిళా యువత అత్యంత ప్రభావితంగా చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, జిల్లా మహిళ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోలేబోయిన సృజన, మండల మహిళ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, మహిళ ఉపాధ్యాయురాలు చొప్పదండి వసంత, సూదిరెడ్డి జయమ్మ, ఏనుగు సునీత, బద్దం లింగారెడ్డి, జంపాల చంద్రశేఖర్, పంగ శ్రీను, కొర్ర శ్రీను, కోరం రామ్మోహన్, ఏనుగు శేఖర్, గోపిదాసు వజ్రమ్మ, కట్ల ప్రమీల, వినోద తదితర నాయకులు పాల్గొన్నారు.

Spread the love