రోడ్డు ప్రమాదం లో ఒకరి మృతి..

నవతెలంగాణ- డిచ్ పల్లి:
ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి తండా గ్రామానికి చెందిన బాదావత్ ధర్మ 67 లారి డీ కోని అక్కడి కక్కేడే మృతి చెందినట్లు ఎస్సై మహేష్ శనివారం తెలిపారు. అయన తెలిపిన వివరాల ప్రకారం ఇందల్ వాయి తండా కు చెందిన ధర్మ తన ద్విచక్ర వాహనం పై శుక్రవారం రాత్రి డిచ్ పల్లి వైపు నుండి ఇందల్ వాయి తండా స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యంలోని బీబీపూర్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారి44 భరత్ పెట్రోల్ పంప్ వద్ద  రోడ్డు పై అడ్డంగా నిర్లక్ష్యంగా అపి వున్నా లారి ని డీ కొట్టడం వల్ల ధర్మ అక్కడిక్కడే మృతి చెందినట్లు ఎస్సై మహేష్ వివరించారు . మృతుని రెండవ కుమారుడు బాదావత్ వెంకట్ రామ్  పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా కేంద్ర మార్చురీకి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
Spread the love