జీవితంపై ఒక లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగాలి: ఎస్ఐ లింగం

నవతెలంగాణ – తొగుట
జీవితంపై ఒక లక్ష్యం, ఏర్పాటు చేసుకొని ముందుకు సాగాలని, మనిషి మనుగడకు చదువు చాలా ముఖ్యం అని విద్యార్థులకు తొగుట ఎస్ఐ బీ. లింగం సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు హ్యాంటి హ్యుమన్ ట్రాఫి కింగ్ ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, మానవ అక్రమ రవాణా నిర్మూలన, గుడ్ టచ్, బాడ్ టచ్ గురించి గజ్వే ల్ షీ టీమ్ బృందం తో కలిసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ లింగం మాట్లాడు తూ అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మవద్దన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, అవసరం మేరకే సెల్ ఫోన్ వాడుకోవాలన్నారు. టెక్నాలజీలో మంచిని స్వీకరించాలని సూచించారు. తల్లి దండ్రుల కష్టాన్ని గుర్తుంచుకొని చదువును ఇష్టపడి చదవాలన్నారు. జీవితంపై ఒక లక్ష్యం, ఒక గోల్ ఏర్పాటు చేసుకొని ముందుకు సాగాలని పేర్కొన్నారు. మనిషి మనుగడకు చదువు చాలా ముఖ్యం అని చెప్పారు. అందరు కలిసిమెలిసి ఉండాలని, ఒకరికొకరు చదువులో సహాయం చేసుకుంటూ ఒక లక్ష్యం, గోల్ ఏర్పాటు చేసుకుని దాని కనుగుణంగా కష్టపడి చదువుకోవాలన్నారు. ఎవరు కూడా బాల్య వివాహాలు చేసుకొని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అని, బాల్య వివాహాలు, మానవ అక్రమా రవాణా గురించి సమాచారం ఉంటె మాకు తెలియజేయాలని సూచించారు. సెల్ ఫోన్స్ అవసరం మేరకు ఉపయోగించాలని, ఎవరు కూడా సైబర్ నేరాలకు గురికావద్దని, తెలియని వ్యక్తులు నుండీ వచ్చే మెసేజ్ లకు రెస్పాండ్ కావద్దని, బ్యాంక్ అధికారులము అంటూ ఎవరైన ఫోన్ చేసి అకౌంట్ వివరాలూ అడిగితే చెప్పవద్దు అని తెలిపారు. అలాంటి విషయాలు ఇంట్లో పెద్దలకు తెలియజేయాలని అన్నారు. విద్యార్థులను ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలు, యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా షీ టీమ్ నెంబర్  8712667434 కాల్ చేయాలని సూచించారు. మహిళల రక్షణకు ఎల్ల ప్పుడు షీ టీమ్ అండగా ఉంటుందని అన్నారు.
అపరిచిత వ్యక్తులను నమ్మవద్దని ఈ వయసులో ప్రేమ పెళ్లి అంటూ చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. యం. అనురాధ తెలుగు టీచర్ షీటీమ్స్, పోలీసులు నిర్వహిస్తున్న విధులపై కవిత రాసి అద్భుతంగా పాడారు. అందుకుగాను ఎస్ఐ లింగం, అనురాధ ఉపాధ్యాయురాలును అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యులు ఉపేందర్, అధ్యాపకులు, తొగుట ఎఎస్ఐ రాంరెడ్డి, గజ్వేల్ షీటీమ్ బృందం శ్రీరాములు ఏఎస్ఐ, కానిస్టేబుళ్లు రామచంద్రారెడ్డి, మహేష్, మహిళా కానిస్టేబుళ్లు శ్యామల, లావణ్య, విద్యా ర్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love