మినీ స్టేడియంలో హాకీ క్రీడాకారుల ఎంపికలు

నవతెలంగాణ- ఆర్మూర్: పట్టణంలోని మినీ స్టేడియం  నందు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి సంగీతరావు ఆధ్వర్యంలో 67వ ఎస్ జి ఎఫ్ జిల్లా యు 14హాకీ బాలుర  బాలికల క్రీడాకారులు ఎంపికలు సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ ఎంపికలకు జిల్లా లోని వివిధ పాఠశాలల నుండి క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఎంపికైన క్రీడాకారులు త్వరలో నిర్వహించే కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల సెలక్షన్స్ కు పాల్గొనడం జరుగుతుంది. ఈ ఎంపిక కార్యక్రమానికి    జిల్లా ఎస్ జి ఎఫ కార్యదర్శి సంగీతరావు  హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకోవడం జరిగింది. క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ నిజాంబాద్ జిల్లా ప్రతి సంవత్సరము రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలవడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా మన జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లాకు పేరు తీసుకురావాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పేట సంఘం కార్యదర్శి మల్లేష్ గౌడ్  జిల్లా హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ, కోశాధికారి సురేందర్, హాకీ సంఘ సభ్యులు చిన్నయ్య, నాగేష్,  వ్యాయామ ఉపాధ్యాయులు రాజేష్ శ్రీకాంత్  తదితరులు పాల్గొన్నారు.

Spread the love