‘ప్రిలిమ్స్‌ పరీక్షను మళ్లీ పెట్టేలా ఆదేశించండి’

నవతెలంగాణ-హైదరాబాద్‌
తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ఈ నెల 11న నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించేలా ఆదేశాలివ్వాలని హైకోర్టులో రిట్‌ దాఖలైంది. అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకోకపోవడంతో అక్రమాలకు తెర లేచే ప్రమాదం ఉంటుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిలిమ్‌ పరీక్షను రద్దు చేసిన మళ్లీ నిర్వహించేలా టీఎస్‌పీఎస్సీని ఆదేశించాలంటూ గ్రూప్‌-1 అభ్యర్థులు బి.ప్రశాంత్‌, బండి ప్రశాంత్‌, జి.హరికృష్ణ పిటిషన్‌ వేశారు.

Spread the love