మాది సెక్యులర్‌ సర్కార్‌

Ours is a secular government– మోడీ, అమిత్‌షా దీన్ని రద్దు చేస్తామంటున్నారు..అది వారి వల్ల కాదు
– ఇఫ్తార్‌ విందు మతసామర్యానికి ప్రతీక : సీఎం రేవంత్‌ రెడ్డి
– ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తాం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ 
రాష్ట్రంలో పక్కా సెక్యులర్‌, ప్రజా ప్రభుత్వ పాలన సాగుతున్నదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, షబ్బీర్‌అలీ, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ముస్లీం మత పెద్దలు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి అనాధపిల్లలకు కానుకలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆత్మీయత, మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. విద్య ఉద్యోగాల్లో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలుపరు స్తామన్నారు. వాటిని మోడీ, అమిత్‌షా రద్దు చేస్తామ ంటున్నారనీ, అది వారి వల్ల కాదని చెప్పారు. వాటిని అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదని చెప్పారు. మైనా ర్టీ పాఠశాలలకు, రెసిడెన్షియల్‌ భవనాల కోసం ప్రభు త్వం ఇప్పటికే నిధులు విడుదల చేసిందని తెలిపారు. ప్రభుత్వం మైనార్టీలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పింస్తుందని చెప్పారు. వారికి అండగా ఉంటుందన్నారు. అన్ని వర్గాలకు సమానమైన గౌరవం ప్రజా ప్రభుత్వంలో ఉంటుందని తెలిపారు.

Spread the love