పేదలపై బరాలు మోపిన ప్రభుత్వాలను గద్దె దించండి..

– సీపీఐ(ఎం) నాయకులు బొల్లం అశోక్, యాకుబ్ ల డిమాండ్

నవతెలంగాణ-తొర్రూర్ రూరల్
పేదలపై భారాలు మోసే ప్రభుత్వాలను గద్దె దించాలని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా నాయకులు అశోక్, యాకుబ్ లు డిమాండ్ చేశారు. సోమవారం మండలం లోని కంటయపాలెం, గుర్తురు పార్టీ గ్రామ శాఖల ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన నిత్యవసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలని రాష్ట్ర కమిటీ లో పిలుపులో భాగంగా గ్రామాలలో ఆందోళనలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు బొల్లం అశోక్, సిపిఎం తోరూర్ మండల కార్యదర్శి ఎండి యాకూబ్ లు హాజరై మాట్లాడుతూ,కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలు పెంచి సామాన్యులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారని వారు అన్నారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గ్యాస్ ధర 500 రూపాయలు ఉంటే బిజెపి అధికారంలోకి వచ్చిన 9 సంవత్సరాల కాలంలో 8సార్లు గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల జీవితాలతో ఆటలాడుకుంటుందని, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 200 రూపాయలు తగ్గించి గ్యాస్ ధర తగ్గించామని సంకలు కొడుతుందని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఉప్పులు, పప్పులు నూనె, చింతపండు, తదితర రేట్లు విపరీతంగా పెంచి సామాన్యులపై మోయలేని భారం వేస్తుందని విమర్శించారు, తక్షణమే ప్రభుత్వాలు స్పందించి పెంచిన నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని కోరారు. పేదలకు మేలు చేయాల్సినటువంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పేదల మీద భారాలు మోపి కార్పొరేట్ శక్తులకు రాయితీలు కల్పిస్తున్నారని వారు విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మేల్కొని పేదలపై మోపిన బారాలను తగ్గించాలని, అధికంగా పెరిగినటువంటి నిత్యవసర వస్తువుల ధరను తగ్గించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరినీ కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు సోమిరెడ్డి, మార్క సాంబయ్య, గుద్దేటి సాయిమల్లు, బోర స్వామి, తాళ్ల వెంకటేశ్వర్లు, శంకర్, ఉమగాని యాకయ్య, జితేందర్, ఎల్లయ్య ,కుమార్, జెళ్ల శీను, పరశురాములు, సోమయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love