పద్మశాలి వధూవరుల పరిచయ వేదికను సద్వినియోగం చేసుకోవాలి

నవతెలంగాణ – కమ్మర్ పల్లి

మార్చి 31న  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించనున్న  పద్మశాలి వధూవరుల పరిచయ వేదికను పద్మశాలి యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని  పద్మశాలి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు భోగ అశోక్, నిజామాబాద్ వధూవరుల పరిచయ వేదిక సంఘం ఉపాధ్యక్షులు గాలేపల్లి నారాయణ కోరారు.  ఈ మేరకు ఆదివారం మండల కేంద్రంలో పలువురు పద్మశాలి ప్రముఖులకు 6వ పద్మశాలి వధూవరుల పరిచయక వేదిక సంఘం నిజామాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక కరపత్రాలను ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 31న జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఉదయం 11గంటల నుండి  వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. పద్మశాలి కులస్తుల, బంధుమిత్రులు ఈ  కార్యక్రమంలో పాల్గొని వధూవరుల పరిచయ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదని, భోజన వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు వివరించారు.  ఈ కార్యక్రమంలో పద్మశాలి  సంఘం సభ్యులు  అన్నం గణపతి రాం, బొడ్డు శంకర్, పోతు ధరణి కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love