
రెంజల్ మండలం బాగేపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ పాముల సాయిలు ఆధ్వర్యంలో వికలాంగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వికలాంగులకు 3016, రూపాయల పింఛన్ కు బదులుగా 4 016 రూపాయలకు పెంచడంతో వారు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామంలో ఆరుగురు వికలాంగులకు పింఛన్ రావడంతో వారు స్థానిక ప్రజాప్రతినిధులతో పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శ్రీకాంత్, అబ్బయ్య, నరేష్, విట్టల్, కారోబార్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.