రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ గా పాలరామారావు నియామకం

నవ తెలంగాణ -సుల్తానాబాద్ రూరల్:
మండలంలోని కాట్నపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ పాల రామారావును పెద్దపల్లి జిల్లా రైతుబంధు కోఆర్డినేటర్ గా నియామకం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ రఘునందన్ రావు నియామకపు ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియామకం అయిన పాల రామారావు మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి రుణపడి ఉంటాను అన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పాలరామారావు పేర్కొన్నారు.కాగా పాల రామారావు నియామకం పట్ల మండలంలోని పలువురు హర్షం వ్యక్తం చేశారు.
Spread the love