పంచాయతీ కార్యదర్శి మురళిని ఆదర్శంగా తీసుకోవాలి..

– జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, మద్నూర్, జుక్కల్, ఎంపీడీవోలు

నవతెలంగాణ – మద్నూర్
విరమణలో కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి మద్నూర్ ఎంపీడీవో రాణి, జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్య, పంచాయితీ కార్యదర్శుల సంఘం జోనల్ అధ్యక్షులు భాస్కర్ కలిసి పదవి విరమణ పొందిన మురళి దంపతులకు ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, మద్నూర్ మండల ఎంపీడీవో రాణి, జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్, మద్నూర్ మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్య, సన్మానం అనంతరం మాట్లాడారు, మురళి సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. మురళిని ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామపంచాయతీ కార్యదర్శి తమ విధులు సక్రమంగా నిర్వహించి ప్రజల మన్ననాలు పొందాలని కొనియాడారు. సుల్తాన్ పేట్ గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహించిన మురళి 25 సంవత్సరాల కాలంగా కారోబారుగా నిజామాబాద్ జిల్లాలో విధులు నిర్వహించగా, రెండున్నర సంవత్సరాల క్రితం ప్రమోషన్ ద్వారా మద్నూర్ మండలంలోని సుల్తాన్ పేట్ గ్రామ కార్యదర్శిగా విధుల్లో చేరారు. ఈ రెండున్నర సంవత్సరాల కాలంగా ఆయన విధులు ప్రభుత్వ నిబంధనాల ప్రకారం ఇటు అధికారికంగా పనులు గాని పంచాయితీ గ్రామ సమస్యల పరంగా గాని ఎలాంటి లోటు లేకుండా విధులు నిర్వహించి, ప్రతి ఒక్కరి ద్వారా మంచి జిపి కార్యదర్శిగా మన్ననాలు పొందారు. మురళి పదవి విరమణ కార్యక్రమం కి ఆయన బంధుమిత్రులతో పాటు మద్నూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇతర శాఖల అధికారులు హాజరై మురళి దంపతులకు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల గ్రామ కార్యదర్శులు సంఘం నాయకులు సందీప్ గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.
Spread the love