రోడ్డు ప్రమాదంలో పంజాగుట్ట కానిస్టేబుల్ స్వామి మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న గోల్కొండ స్వామి (36)కి రోడ్డు ప్రమాదం జరిగింది. నర్మెట నుంచి ఆటోలో జనగామకు వెళ్తుండగా నర్మెట-హన్మంతాపూర్ మధ్య లో ఆటోలో నుండి కింద పడిపోగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రుడిని జనగామ ఏరియా ఆస్ప త్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

Spread the love