నేడు భారతీయ మార్కెట్లోకి రియల్‌మీ 11 ప్రో 5జీ సిరీస్‌ మొబైల్‌ ఫోన్లు

నవతెలంగాణ – న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ తన సరికొత్త రియల్‌మీ 11 ప్రో 5జీ సిరీస్‌ ఫోన్లను నేడు భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. రియల్‌మీ 11 ప్రొ, రియల్‌మీ 11 ప్రో ప్లస్‌ మోడళ్లను గురువారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నది. ఇప్పటికే ఈ రెండు స్మార్ట్‌ ఫోన్లను చైనాలో అందుబాటులోకి తీసుకొచ్చింది. లాంచింగ్‌ సందర్భంగా ప్రీ ఆర్డర్లతోపాటు లాంచింగ్ ఆఫర్ కూడా అందిస్తున్నది. వీటిలో 6.7 అంగుళాల కర్వ్‌డ్‌ డిస్‌ప్లే, 1 టీబీ వరకు ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీలు ఉన్నాయి. రియల్‌మీ 11 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్, 100 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. ఇక రియల్‌మీ 11 ప్రో ప్లస్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్, 200 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నారు. రియల్ మీ 11 ప్రో 5జీ, రియల్ మీ 11 ప్రో+ 5జీ ఫోన్లు 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డీ + (1080×2412 పిక్సెల్స్) కర్వ్‌డ్ డిస్ ప్లేస్ విత్ 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటాయి. రెండు ఫోన్లలోనూ ఆక్టాకోర్ 6ఎన్ఎం మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్ సెట్ ఉంటుంది. రెండు ఫోన్లలోనూ 5000 ఎంఎహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతోపాటు రియల్ మీ 11 ప్రో విత్ 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్, రియల్ మీ 11 ప్రో + 5జీ ఫోన్ 100 వాట్ల చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ప్రో+ మోడల్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్‍కు, ప్రో మోడల్ 67వాట్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తాయి. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్లు ఈ రియల్‍మీ 11 ప్రో 5జీ సిరీస్ మొబైళ్లకు ఉన్నాయి. రియల్‍మీ వెబ్‍సైట్‍తోపాటు ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‍కార్ట్‌లో కూడా ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి.

Spread the love