చాట్‌జీపీటీతో టీచర్‌ను బురిడి కొట్టించబోయిన 7వ తరగతి స్టూడెంట్!

నవతెలంగాణ – హైదరాబాద్
చాట్‌జీపీటీతో టీచర్‌ను బురిడీ కొట్టించబోయిన 7వ తరగతి విద్యార్థి చివరకు అడ్డంగా దొరికిపోయాడు. తన మేనల్లుడు ఎలా బుక్కయ్యాడో చెబుతూ ఓ నెటిజన్ నెట్టింట షేర్ చేసిన కథనం ప్రస్తుతం వైరల్‌గా మారింది. టీచర్ ఇచ్చిన హోం వర్క్‌ను ఆ విద్యార్థి చాట్‌జీపీటీ సాయంతో పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఓ ప్రశ్నకు చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానాన్ని యథాతథంగా తన హోం వర్క్‌లో రాసుకొచ్చాడు. ‘ఓ ఏఐ సాంకేతికతగా నాకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవు’ అన్న చాట్‌జీపీటీ మాటలను కూడా తన హోం వర్క్‌లో రాసేశాడు. దీంతో, సమాధాన పత్రంలోని ఆ వ్యాక్యాన్ని టీచర్ హైలైట్ చేసింది. దాని తాలూకు స్క్రీన్‌షాట్‌ను ఓ నెటిజన్ నెట్టంట పెట్టడంతో అది తెగ వైరల్ అవుతోంది. కుర్రాడి పొరపాటు చూసి నెటిజన్లు పడీపడీ నవ్వుకుంటున్నారు.

Spread the love