హైదరాబాద్: హిందుజా గ్రూప్ నకు చెందిన జిఒసిఎల్ కార్పొరేషన్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 126 శాతం వృద్థితో రూ.1410 కోట్ల ఆదాయన్ని ఆర్జించింది. ఇదే సమ యంలో నికర లాభాలు 20 శాతం పెరిగి రూ.211 కోట్ల లాభాలు నమోదు చేసింది. 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 85 శాతం పెరుగుదలతో రూ.302 కోట్ల రెవెన్యూ నమోదు చేసింది.