శంకర్పల్లి సీఐ ప్రసన్నకుమార్
నవతెలంగాణ-శంకర్‌పల్లి
యువత చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే క్రీడా కోట కింద ఉద్యోగం సంపాధించవచ్చుని శంకర్పల్లి సీఐ ప్రసన్నకుమార్ అన్నారు. సమ్మర్ కోచింగ్ క్యాంప్ వాలీబాల్ 2023 టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవం బుధవారం జరిగింది. శంకర్పల్లి మండలంలోని మోకిలా క్రీడా ప్రాంగణంలో డీఎస్‌డీఏ గ్రామపంచాయతీ దాతల సహకారంతో నెలరోజులపాటు వాలీబాల్ సమ్మర్ కోచింగ్ వేసవీ శిక్షణా శిబిరం ముగింపు సందర్భంగా నిర్వహించిన టోర్నమెంటులో 16 జట్లు పాల్గొనగా ప్రథమ బహుమతి మోకిలా జట్టు గెలుపొందగా, రెండోవ బహుమతి కొండకల్ తండా విజయం సాధించింది. గెలుపొందిన వారికి శంక ర్పల్లి సిఐ ప్రసన్నకుమార్, ఎంపీడీవో వెంకయ్య వేర్వే రుగా బహుమతుల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ యువతి, యువకులు విద్యతో పాటు, క్రీడల్లో ప్రతిభ కనబరిచేందుకు కృషి చేయాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు, శారీరక దృఢత్వం పెంపొందు తుందన్నారు. అలాగే గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు పోలీస్ శాఖలో జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన కోటా తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందనీ దీంతో యువత క్రీడల్లో రాణించాలని సూచించారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలు ఏర్పాటు చేయ డం వల్ల వారిలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు అవకాశం ఉటుందన్నారు. వారం రోజుల క్రితం సీఎం కప్ టోర్న మెంట్ కూడా ఇదే క్రీడాప్రాంగణంలో నిర్వహించడం జరి గిందన్నారు. చాలామంది క్రీడాకారులు క్రీడల్లో పాల్గొ న్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమ్మర్ క్యాంప్ నిర్వా హకులు సామాజిక కార్యకర్త పాపగారి ఆశీర్వాదం, వార్డు సభ్యులు శేఖర్, ముక్రం, విట్టల్, కుమార్, కోచ్ ,రెపీరీలు శ్రీనాథ్‌రెడ్డి, కిరణ్ కుమార్, సునీల్ వివిధ గ్రామాల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.