టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్
నవతెలంగాణ-షాద్‌నగర్
దోచుకోవడం, దాచుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ వన్‌గా ఉందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం షాద్‌నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1200 మంది విద్యార్థుల ఆత్మ బాలిదానాలపై తెలంగాణ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న రాష్ట్రంలో మేమే నెంబర్ వన్ అని విర్రవీగుతున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎందులో నెంబర్‌వన్ అని ప్రశ్నించారు. ‘తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన కుటుంబాలను మోసం చేయడంలో నెంబర్‌వన్ మీరేనా అని’ ప్రశ్నిం చారు. దళితులకు ముఖ్య మంత్రి పదవి ఇస్తామని మోసం చేయడంలో, దళితుడినే సీఎం చేస్తామని, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీల్లో విఫలం కావడమేనా అని నిలదీశారు. తెలంగాణ రాక ముందు మీ ఆస్తులెన్ని? ఇప్పుడున్న ఆస్తులు ఎన్ని? అక్రమ సంపాదనలో నెంబర్‌వన్ మీరు కాదా అని అన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సొంత ఊరిలోనే 400 ఎకరాలను పేదలకు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 15 వేల ఎకరాలను పంచిన ఘనత కూడా తమదేనని అన్నారు. కాంగ్రెస్ దయతోనే ఉద్యోగంలో చేరిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అక్రమాలకు పాల్పడి ఉద్యోగంలో సస్పెండ్ కాలేదా అని ప్రశ్నించారు. పేద ప్రజలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కూడా అమలు చేయకుండా వచ్చే ఎన్నికల్లో మొఖాలు చెల్లుతాయాని విమ ర్శించారు. గత తొమ్మిదేండ్లలో ఏం ప్రగతి సాధించారని దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటారని అన్నారు. నియోజక వర్గానికి సాగునీరు ఇస్తామని లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కట్టిస్తామని చెప్పిన పాలకులు పది ఎకరాల కైనా సాగు నీరు ఇచ్చారా అని మంత్రిని ప్రశ్నించారు. ఒక మంత్రి హౌదాలో ఉంటూ నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సహింబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు మహ్మద్ అలీఖాన్ బాబర్, ఐఎన్టీయూసీ నేత పి. రఘు, తుపాకుల శేఖర్, రమేష్, వెంకట్ రెడ్డి, రవీందర్ గౌడ్, దేవేందర్, రాజశేఖర్, దేవగిరి నవీన్, సుదర్శన్, బుడ్డ నర్సింహ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.