ఓట్లను గంపగుత్తగా ఖరీదు చేసేందుకు ప్రయత్నాల్లో పార్టీలు

– నోటుకు ఓటు అమ్ముడు పోకుండా ఎన్నికల సంగం పకడ్బందీ నిఘ పెట్టేనా
నవతెలంగాణ- మద్నూర్: ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల ప్రచారాల గడువు ఈనెల 28 సాయంత్రం ఐదు గంటలకు ముగిశాయి. ఇక సభలు సమావేశాలు ఉండవు పోటీ చేసే పార్టీల అభ్యర్థులు ఓటర్లను గాలం చేసేందుకు కుల సంఘాల ఓట్లను గంపగుత్తగా ఖరీదులు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుపుతున్నట్టు చర్చలు జోరుగా వినిపిస్తున్నాయి. ఓటుకు నోటు అమ్ముడు పోకుండా ఎన్నికల సంఘం కుల సంఘాల ఓట్లు ఖరీదు కాకుండా గట్టిగా నిఘ పెట్టేనా అనే చర్చలు జుక్కల్ నియోజకవర్గం ప్రజల్లో వినబడుతున్నాయి. పార్టీల అభ్యర్థులు గెలుపు కోసం ఓటర్లకు డబ్బు మద్యం పంచడానికి మిగిలిన రెండు రోజులు ఓట్ల కొనుగోళ్ల ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది కులబేడల సంఘాల అధ్యక్షులు కార్యదర్శిలు సంఘం సభ్యులతో గంప గుత్తగా సంఘాల ఓట్ల ఖరీదు పట్ల ప్రయత్నాలు జరుగుతున్నట్లు చర్చలు వినబడుతున్నాయి. కుల సంఘాల గంప గుత్తగా ఖరీదే కాకుండా కుటుంబాల ఓట్లపై కన్నేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు మద్యం బాటిల్ల పంపిణీకి పార్టీల నాయకులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఎన్నికల్లో మద్యం పంపిణీ డబ్బు పంపిణీ జరగకుండా ఎన్నికల కమిషనర్ మద్యం నిలువలపై ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేసినప్పటికీ అధికారుల కండ్లుగప్పి పార్టీల అభ్యర్థులు మద్యం పంపిన కోసం ఈపాటి కె భారీగా నిలువలు చేసుకున్నారని ఆరోపణలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇక డబ్బు పంపిణీ కోసం సిద్ధమవుతున్నట్లు ఓటుకు నోటు ఖరీదు చేసేందుకు లక్షల రూపాయలు పంపిణీలు జరిపేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మద్యం పంపిణీ పట్ల డబ్బు పంపిణీ పట్ల ప్రత్యేక బృందాలు పకడ్బందీ నిఘా పెడితే మద్యం డబ్బు పట్టుబడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిగా బృందాలు మిగిలిన రెండు రోజులు పకడ్బందీగా పంపకాలు జరగకుండా చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని మద్యంతో డబ్బుతో ఓట్లు అమ్ముడు పోకుండా ఎన్నికల సంఘం అధికారుల బృందాలను పకడ్బందీ ఆదేశాలు ఇవ్వవలసిన అవసరం ఉందని నియోజకవర్గం ప్రజల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది. మిగిలిన రెండు రోజులు ఎన్నికల సంఘం మద్యం డబ్బు పంపిణీ జరగకుండా ఏ విధమైన చర్యలు చేపడుతుందో వేచి చూడాలి.
Spread the love