అంకాపూర్ గ్రామంలో పత్రీజీ జన్మదిన వేడుకలు..

నవ తెలంగాణ -ఆర్మూర్   
సుభాష్ పత్రీజీ గారి జన్మదిన  సంబరాలను ఆదివారం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మండలం  లోని అంకాపూర్ గ్రామంలో   శ్రీ కూనింటి శేఖర్ రెడ్డి పద్మావతి  దంపతుల  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కేకును కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పి ఎస్ ఎస్ ఎం జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణ రెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీ నల్ల గంగారెడ్డి, నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహా శక్తి క్షేత్రం చైర్మన్  తిరుమల గంగారాం రెడ్డి , ముఖ్య సలహాదారులు బొడ్డు దయానంద్  , విశిష్ట అతిథులుగా డాక్టర్ నీలిమా ,  బ్రహ్మ కంటి గీతాంజలి    ప్రసంగించారు  ధ్యానం వల్ల కలిగే ఉపయోగాలని సందర్భంగా వివరించారు.  ధ్యానం వల్ల ఆనందం,  ఐశ్వర్యం ధ్యానం వల్ల ఆరోగ్యం  కలుగుతుందని  ఈ సందర్భంగా తెలిపారు.  ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని ఈ సందర్భంగా తెలిపారు.  ఈ కార్యక్రమంలో  కిష్టయ్య, పెరికిట్ రమేష్, ఇస్సపల్లి  చిన్నయ్య  నారాయణ,   కొత్తపల్లి రాజిరెడ్డి, ఇస్సపల్లి రాజు, గొల్ల మల్లయ్య, యోగ రాజేందర్, జీకే రమేష్, హేమంత్ కుమార్  300 మంది ధ్యానులు పాల్గొన్నారు.
Spread the love