రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్..

నవతెలంగాణ – అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టుకు వెళ్లనున్నారు. కొండగట్టు అంజన్నను తమ ఇలవేల్పుగా భావించే పవన్.. ఎన్నికల్లో విజయం సాధించడంతో ఇక్కడ మొక్కులు చెల్లించుకోనున్నారు. గతంలో వారాహి యాత్రకు ముందు ఆ వాహనానికి ఇక్కడే పూజలు చేయించారు. రేపు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి రోడ్డు మార్గంలో కొండగట్టుకు వెళ్తారు.

Spread the love