నవతెలంగాణ – ఆళ్ళపల్లి : ఆళ్ళపల్లి మండల కేంద్రములో గత 32 రోజులుగా కొనసాగుతున్న గ్రామ పంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె వద్దకు పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం చేరుకుని వారిని పలకరించారు. ఈ సందర్భంగా పాయం మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన 13 డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కార మార్గం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గొగ్గెల వసంతరావు, వాసం శ్రీకాంత్, గొగ్గెల శ్రీను, గలిగె లక్ష్మీనారాయణ, వూకె ఎర్రయ్య, పాయం నర్సింహారావు, భరత్, ఆళ్ళపల్లి పంచాయతీ కార్మికుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పరమ ప్రభుదాస్, మల్కపురి శేఖర్, చంద్రబాబు, చలపతి, నర్సయ్య, ముసలయ్య, ఏలియా, తదితరులు పాల్గొన్నారు.