పెన్సిల్లు ఎదురుచూస్తున్నాయి

పెన్సిల్లు ఎదురుచూస్తున్నాయిచేతులూ కాళ్ళూ విరిగిపోయిన పెన్సిల్లు
చెవులూ కళ్ళూ పేలిపోయిన పెన్సిల్లు
నరాలూ పేగులూ తెగిపోయిన పెన్సిల్లు
చిట్టితల్లీ.. భూమిలోంచి వస్తావో, ఆకాశం నుంచి వస్తావో
త్వరగా రా ఓ నా చిట్టితల్లీ..
కూలిపోయిన ఇంటి గోడల కింద
నీ పెన్సిల్లు ఎదురుచూస్తున్నాయి.
తల్లి కోసం పిల్లలేడ్చినట్టు పాల కోసం శ్వాసలేడ్చినట్టు
నీ పెన్సిల్లు నీకోసం ఏడుస్తూ ఎదురుచూస్తున్నాయి
కాలిపోయిన వాటి చర్మ బూడిదను కుప్ప పేరుస్తున్నాయి
బాంబు చప్పుళ్ళు వినిపించకుండా వుండేందుకు
పెన్సిల్లకు లాలిపాటలు పాడేదావిని కదూ..
చిట్టితల్లీ.. నీ లాలిపాటలు వినటానికి
యుద్ధంలో మరణించిన పెన్సిల్లు
హదయాలతో వేచి చూస్తున్నాయి
నువ్వు త్వరగా వస్తే పసిపాపల్లాంటి నీ పెన్సిల్ల స్నేహగీతాన్ని వింటూ
బూడిదరంగులో వుండే పక్షుల బొమ్మలు గీద్దాం
బూడిదకు.. కొన్ని స్వేచ్ఛాదారులు చూపిద్దాం.
– దొంతం చరణ్‌

Spread the love