నవతెలంగాణ-సిర్పూర్(టి)
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను సమస్యలను పరిష్కారించే దిశగా ఆలోచనలు చేయాలని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు ఏటుకూరు శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పీఆర్టీయూ టీఎస్ మండల శాఖ సర్వసభ్య సమావేశాన్ని మేడి లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మండల నూతన శాఖను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, ఈ ఎన్నికకు ఎన్నికల అధికారిగా జాడి దేవాజీ, ఇందారపు ప్రకాష్‌లు వ్యవహరించారు. దీనికి ముఖ్య అథితిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌లో రుణాలు, పాక్షిక ఉపసహరణ బిల్లులు గత రెండు సంవత్సరాల నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అదే విధంగా తెలంగాణ స్టేట్ జనరల్ ఇన్సూరెన్స్ పథకం పూర్తి అయిన ఉపాధ్యాయులు ఉపసంహరణకు రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారని తెలిపారు. సప్లమెంటరీ బిల్లులన్ని రెండు సంవత్సరాల నుంచి ట్రెజరీలో ఈ కుబేర్‌లో మాత్రమే ఉంటున్నాయని పేర్కొన్నారు. వెంటనే ఉపాధ్యాయుల వ్యక్తిగత ఖాతాలో జమ అయ్యే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, ఉపాధ్యాయులు దొంతి రాజు వేణుగోపాల్, సదాశివుడు, జావిద్ అహ్మద్, శ్రీకాంత్, అనిల్, సహదేవుడు, వెంకటరమణ, సుధాకర్, పవన్, జ్యోతి, చిన్న అంకు, సరిత, షభానా బేగం, యాష్మిన్ పాల్గొన్నారు.