సత్వరమే పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి

– ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-కంటోన్మెంట్‌
సత్వరమే పెండింగ్‌ పనులు పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం ఓల్డ్‌ బోయన్‌ పల్లి కార్పొరేటర్‌ ముద్దం నరసింహ యాదవ్‌, అధికారులతో కలిసి బోయన్‌ చెరువు మానస సరోవర్‌ హైట్స్‌ దగ్గర నాలా డ్రయినేజీ సమస్యలను ఎమ్మెల్యే పరిశీలించారు. అలాగే అధికారులందరితో రివ్యూ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో స్థానిక కాలనీవాసులు ఇచ్చిన ఫిర్యాదులపై ఎమ్మెల్యే స్పందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎప్పుడూ లేని విధంగా బోయన్‌ చెరువులో గుర్రపు డెక్క పేరుకపో వడంతో దానిని అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజ లు దోమల బారినపడి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన నాలా పనులను చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, డ్రయినేజీలు పొంగిపొర్లుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇలాగే జరిగుతే ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని, ఇకనైనా అధికారులు స్పందించి బోయన్‌ చెరువులోని గుర్రపు డెక్కన్‌ నాలా పనులను డ్రయినేజీ, రోడ్లు పనులు చేపట్టాలని అన్నారు. అలాగే వీధి దీపాలు సరిగ్గా వెలగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, విద్యుత్‌ పనులు కూడా వేగవంతం చేసి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఓల్డ్‌ బోయిన్‌పల్లి డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని, అదేవిధంగా నూతన పనులకు కావలసిన నిధులను, జిల్లా మంత్రులను కలిసి బడ్జెట్‌ తీసుకువస్తామని ఎమ్మెల్యే మాధవరం కష్ణారావు అన్నారు .ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ ముద్ధం నరసింహ యాదవ్‌, ఇర్ఫాన్‌, నరేందర్‌ గౌడ్‌, మక్కాల నర్సింగ్‌, జంగయ్య, హరినాధ్‌, యాదగిరి పాల్గొన్నారు.

Spread the love