నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల : ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు చేయుతపింఛన్లు పెంచిజూన్ 2 నుండి ఇవ్వాలని అలాగే రెండు లక్షల కొత్త పింఛన్లు కూడా అర్హులైన కొత్తవారికి ఇవ్వాలని సీపీఐ(ఎం) సిరిసిల్ల పట్టణ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అమలు చేసిన వికలాంగులకు 4016లు వృద్ధులు వితంతువులు వికలాంగులకు ఒంటరి మహిళలకు తదితర వారికి ఇస్తున్న 2016లు రూపాయలు కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల 6000 లు వృద్ధులు ఇతరులకు 4000లు ఇస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని జూన్ 2 నుండి హామీ ఇచ్చిన మేరకు పెన్షన్లు పెంచి ఇవ్వాలని కొత్త పెన్షన్లు మంజూరయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అలాగే గత ప్రభుత్వ కాలంలో సదరం సర్టిఫికెట్లలో అంగవైకల్యం లేకున్నా అంగవైకల్యం ఉన్నట్టు పర్సంటేజీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని వాటిని కూడా రీ వెరిఫికేషన్ చేయాలని ఆయన కోరారు.
చేయూత పింఛన్లు పెంచి ఇవ్వాలి: ఎలిగేటి రాజశేఖర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


