ప్రజలు, రైతులు కేసీఆర్ ను వదులుకొని బాధపడుతున్నారు

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ప్రజలు, రైతులు కేసీఆర్ ను వదులుకొని బాధపడుతున్నారని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, రాష్ట్ర నాయకులు బద్దం చిన్నారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చౌట్ పల్లిలో ఉపాధి హామీ పని ప్రదేశంలో బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజరెడ్డి రెడ్డి గోవర్థన్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజరెడ్డి రెడ్డి గోవర్థన్ కు  ఇక్కడి ప్రజల కష్టసుఖాలు తెలుసన్నారు.అనుభవం ఉన్న నాయకుడు, ప్రజల మధ్య ఉండే నేత ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. పార్లమెంట్ ఎలక్షన్ లు ఉన్నప్పుడే ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదన్నారు.ఒకవేళ ఈ ఎన్నికల్లో ఓట్లు వేశాక  హామీలు అమలు చేస్తారనే గ్యారంటీ లేదని, ప్రజలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలో  ఒకటి రెండు మినహా వేటిని  అమలు చేయడం లేదన్నారు. ప్రజలు  పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకీ బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారన్నారు. రైతులను, మహిళలను, యువతకు  అనేక హామీలు ఇచ్చారని, ఈ హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలంటే ప్రశ్నిచే కేసీఆర్ సైనికుడు బాజిరెడ్డి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నవీన్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ కొంత ప్రతాప్ రెడ్డి, మాజీ సర్పంచ్ మారు శంకర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love