– మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మట్లేదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఆదివా రంనాడిక్కడి తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఓట్లు దండు కోవడం కోసమే రాహుల్ గాంధీ, ప్రధాన మోదీ ప్రసంగాలు ఉంటున్నాయన్నారు. కులగణన, సామాజిక న్యాయం గురించి జాతీయ నాయకులు మాట్లా డుతున్నారనీ, రాష్ట్రంలో ఆపార్టీలు 17 పార్లమెంట్ సీట్లలో చేసిన సామాజిక న్యాయం లేదన్నారు. కేవలం ఎన్నికల టార్గె ట్‌గా సామా జిక న్యాయం అనే మాటలు ప్రస్తావి స్తున్నారని ఆక్షేపిం చారు. కాంగ్రె స్‌పార్టీ రాష్ట్రం లో ఇచ్చిన హామీలకే దిక్కు లేదనీ, ఇక దేశంలో ఏం అమలు చేస్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పుకొ నేందుకు మోడీ వద్ద ఎలాం టి సమాధానాలు లేవన్నారు. రెండు జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.