
– సామాజిక కార్యకర్త షేక్ సాబిర్ అలి
నవతెలంగాణ – జమ్మికుంట
జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా, బస్టాండ్, రైల్వే స్టేషన్ ఏరియా లో రద్దీ ప్రాంతాల్లో, ప్రధాన కూడళ్లలో సంచరిస్తూ, గుంపులు గుంపులుగా ఉంటున్న పశువులతో వాహనదారులు, పట్టణ ప్రజలు పరేషాన్ అవుతున్నారని సామాజిక కార్యకర్త షేక్ సాబీర్ అలీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదం బారిన పడకుండా వాహనదారులే వాటిని పక్కకు తరలించి, ప్రయాణం కొనసాగించాల్సిన దుస్థితి నెలకొని ఉండడంబాధాకరమన్నారు. వీటిని నియంత్రించాల్సిన మున్సిపల్ సిబ్బంది కానీ, ట్రాఫిక్ ను నియంత్రించాల్సిన పోలీస్ సిబ్బంది కానీ ఈ దిశగా చర్యలు చేపట్టకపోగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తూన్నానని తెలిపారు. కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, పశువులను గోశాలకు తరలించి, దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.