నవతెలంగాణ- బోధన్ టౌన్
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్ బుధవారం తెలిపారు. కూలిన ఇళ్లలో ఉండరాదన్నారు. చెరువులు, వాగుల వద్దకు వెళ్లకూడదని, విద్యుత్ స్తంభాలతో జాగ్రత్తగా ఉండాలని, చిన్న పిల్లలను బహిరంగ ప్రదేశాలకు పంపించరాదని వెల్లడించారు. లోతట్లు ప్రాంతాల ప్రజలు ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.