సృజన్ కుమార్.. తహసిల్దార్
నవతెలంగాణ – గోవిందరావుపేట
విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల మండల వ్యాప్తంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి ప్రజలు వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానిక తహసిల్దార్ సృజన్ కుమార్ అన్నారు. సోమవారం మండల వ్యాప్తంగా ఉన్న పొంగి ప్రవహిస్తున్న వాగులను వరద పరిస్థితిని తాసిల్దార్ సృజన్ కుమార్ వర్షంలో సైతం తడుచుకుంటూ పరిశీలించారు. ప్రజలు పరిస్థితులను అర్థం చేసుకొని అధికారులకు సహకరించాలని సూచించారు. నివసిస్తున్న నివాసగృహాలు వర్షానికి తడవడం వల్ల నివాసానికే అనుకూలంగా ఉన్నాయో లేవు గమనించి నివసించాలని డౌట్ గా ఉంటే రెవెన్యూ అధికారులకు తెలియపరచాలని సూచించారు. వరద పరిస్థితులను సిబ్బంది ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజలు వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -



