బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు ప్రజలకు చెప్పాలి..

నవతెలంగాణ-దుబ్బాక రూరల్ : మెదక్ ఎంపీ ఆదేశానుసారం అక్బరుపేట్ భూంపల్లి మండలం నగరం గ్రామంలో, బీఆర్ ఎస్వీ, యువత, సోషల్ మీడియా, కమిటీల నిర్వహణ  కార్యక్రమం ఆదివారం చేపట్టారు. ఇందులో భాగంగా నగరం గ్రామ బీఆర్ ఎస్ యువత అధ్యక్షుడిగా బైరి నరేష్, బీఆర్ ఎస్ సోషల్ మీడియా అధ్యక్షుడిగా సందా నరేష్ , విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా బైరి నవీన్ లను ఏకగ్రీవంగా ఎన్నకున్నారు. ఈ సందర్భంగా  బీఆర్ ఎస్వీ నియోజకవర్గ ఇంచార్జ్ పాపని సురేష్ గౌడ్ మాట్లాడుతూ భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. సీఎం చొరవతో ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు.  నియోజకవర్గంలో ఒక అబద్ధపు ఒక బూటకపు గ్లోబల్ ప్రచారాలను చేస్తూన్న బీజేపీ ని నాయకులను ఎప్పటికప్పుడు అడ్డుపడి నిలదీసి అరికట్టాలని యువతకు విద్యార్థులకు హితవు పలికారు. ఇకప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటింటికి ప్రతి గడపకు , తండాకు బాధ్యత యుతంగా యువత చేరవేయాలని సూచించారు. మూడో సారి బీఆర్ఎస్ సర్కార్ రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఇంఛార్జీలు పడాల రాజు, అభిలాశ్ రావ్, గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి గౌడ్,ఆత్మ కమిటి డైరెక్టర్ జీడీపల్లి, కిషన్,మార్కెట్ కమిటీ డైరెక్టర్, చందా సిద్దిరాములు, కూడవెళ్లి దేవాలయం డైరెక్టర్  ఎల్కాపల్లి స్వామి, సీనియర్ నాయకులు, యాదా గౌడ్, జీడిపల్లి శ్రీనివాస్, జీడిపల్లి సురేష్, ఉత్తమ్ మల్లేష్,నామాల యదగౌడ్, మధు, కాముని నర్సింలు,కాల్వల స్వామి, విద్యార్థి నాయకులుఉత్తమ్ మహేష్ జీడిపల్లి రాజు, తదితరులు ఉన్నారు.
Spread the love