కేసీఆర్ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు

నవతెలంగాణ- బొమ్మలరామారం
తొమ్మిదిన్నర ఏళ్లుగా అవినీతి అరాచక కుటుంబ పాలన చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి కావాలని భగవంతుని కోరుకుంటున్నారని ఆలేరు కాంగ్రెస్ నియోజకవర్గ అభ్యర్థి బీర్ల ఐలయ్య అన్నారు.ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బొమ్మలరామారం మండలంలో రెండో రోజు గ్రామాలలో తండాలలో ఐలయ్య  ప్రచార కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మంగళవారం బొమ్మలరామారం మండలంలోని చౌదర్ పల్లి లో ప్రారంభమైన ఎన్నికల ప్రచారం మాచన్ పల్లి నాయకుని తండా కాండ్లకుంట తండా పిల్లగుండ తండా మర్యాల చీకటి మామిడి గ్రామాలలో విజయవంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మర్యాల చీకటిమామిడి ప్రచార బహిరంగ సభలో ఐలయ్య మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణ ధనిక రాష్ట్రం కెసిఆర్ పాలనలో అప్పుల రాష్ట్రంగా మిగిలిపోయిందని కెసిఆర్ కుటుంబం మాత్రం దేశంలోనే నెంబర్ వన్ ధనిక కుటుంబంగా మారిపోయిందన్నారు. డిసెంబర్ 3 న కెసిఆర్ అవినీతి అరాచక పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగి తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఆశీస్సులతో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గ్రామ గ్రామాన ప్రజల స్పందన చూస్తుంటే ఆలేరులో లక్ష మెజార్టీతో విజయ దుందుభి మోగించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.రాబోయే 40 రోజులు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి గడప గడపన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను తీసుకువెళ్లి పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సింగిర్తి మల్లేశం వర్కింగ్ ప్రెసిడెంట్ మాడోతు శ్రీరాములు మహిళా అధ్యక్షురాలు సునీత రవీందర్ నాయక్ తో పాటు జిల్లా నియోజకవర్గ మండల యూత్ కాంగ్రెస్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు వార్డు సభ్యులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Spread the love