– ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం విదేశీ పర్యటనలు
– కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఫైర్
నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
ఆచార్య జయశంకర్ తేలంగాణ సిద్ధాంతకర్తగా కేసీఆర్ కు చేదోడుగా ఉంటూ ఉద్యమానికి స్ఫూర్తి కలిగించారని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పేర్కొన్నారు. ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా మంగళవారం జయశంకర్ జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ సమీపంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి జయశంకర్ గ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ తెలంగాణ వచ్చే వరకు జీవించి ఉంటే ఈ 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి సంతోషించే వారు.అదేవిధంగా కాంగ్రెస్ ఎనిమిది నెలల పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న ఆక్రందనలు చూసి చనిపోవాలని కోరుకునే వారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నెలలు గా అరాచక పాలన చేస్తుందని ఫైర్ అయ్యారు. ప్రశ్నించిన వారిని అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ప్రజల కిచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ముఖ్య మంత్రి విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఏద్దేవా చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇష్టారితిగా ప్రవర్తిస్తుందని మండిపడ్డారు. ఆచార్య జయశంకర్ వారసులుగా, కేసీఆర్ సైనికులుగా ప్రజల పక్షాన అహర్నిశలు శ్రమిస్తూ, ప్రజలకి అందుబాటులో ఉంటూ తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కలిసికట్టుగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, చీర పంకజ్ యాదవ్,మాజీ ఆర్వో మాలే శరణ్యారెడ్డి.. జిల్లాగ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రెగట్టే మల్లిఖార్జున రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి,మాజీ ఎంపీపీ కరీం పాషా, మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్, సీనియర్ నాయకులు సింగం రామ్మోహన్, బక్క పిచ్చయ్య, కాంచనపల్లి రవీందర్ రావు,న్యాయవాది గోకికర్ జవహర్,పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్,సింగం లక్ష్మీ, తిప్పర్తి కనగల్ మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, అయితగోని యాదయ్య, కౌన్సిలర్ మారగోని గణేష్, కో ఆప్షన్ సభ్యులు, జమాల్ ఖాద్రి, కొండూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.