5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అనుమతి

Permission to fill 5089 teaching posts– విద్యాశాఖ ఆధ్వర్యంలో డీఎస్సీ ద్వారా నియామకాలు
– ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో 5,089 ఉపాధ్యాయ పోస్టులను భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. 5,089 ఉపాధ్యాయ పోస్టుల్లో 1,739 స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ), 2,575 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ), 611 భాషా పండితులు (ఎల్పీ), 164 ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఈటీ) పోస్టులున్నాయని తెలిపారు. అయితే ఆ పోస్టులను పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో డిపార్ట్‌మెంటల్‌ సెలెక్షన్‌ కమిటీ (డీఎస్సీ) ద్వారా నేరుగా నియామకాలను చేపడతామని పేర్కొన్నారు.
ఖాళీల వివరాలు, రోస్టర్‌ పాయింట్లు, అర్హతలను నిర్ణయించి నియామకాల ప్రక్రియను నిర్వహిస్తుందని తెలిపారు. విద్యాశాఖ కార్యదర్శి, సంచాలకులు తదుపరి చర్యలు తీసుకుంటారని వివరించారు. డీఎస్సీ నోటిఫికేషన్‌, షెడ్యూల్‌ను విడుదల చేస్తారని పేర్కొన్నారు.
10 జిల్లాల్లో వందకంటే తక్కువ పోస్టులు
డీఎస్సీలో వందకంటే తక్కువ పోస్టులు పది జిల్లాల్లో ఉన్నాయి. హన్మకొండలో 54 పోస్టులు, జనగామలో 76 పోస్టులు, జయశంకర్‌ భూపాలపల్లిలో 74 పోస్టులు, కరీంనగర్‌లో 99 పోస్టులు, మహబూబ్‌నగర్‌లో 96 పోస్టులు, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 78 పోస్టులు, ములుగులో 65 పోస్టులు, పెద్దపల్లిలో 43 పోస్టులు, వనపర్తిలో 76 పోస్టులు, యాదాద్రి భువనగిరిలో 99 పోస్టులున్నాయి.
అయితే కొన్ని జిల్లాల్లో ఎస్జీటీ పోస్టుల కంటే ఎస్‌ఏ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు కామారెడ్డిలో ఎస్‌ఏ పోస్టులు 97 ఉంటే, ఎస్జీటీ పోస్టులు 86 ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌లో ఎస్‌ఏ పోస్టులు 61 ఉండగా, ఎస్జీటీ పోస్టులు 36, పెద్దపల్లిలో 30 ఎస్‌ఏ, ఏడు ఎస్జీటీ, సూర్యాపేటలో 80 ఎస్‌ఏ, 78 ఎస్జీటీ, వనపర్తిలో 43 ఎస్‌ఏ, 19 ఎస్జీటీ, వరంగల్‌లో 56 ఎస్‌ఏ, 55 ఎస్జీటీ, యాదాద్రి భువనగిరిలో 39 ఎస్‌ఏ, 38 ఎస్జీటీ పోస్టులున్నాయి.
డీఎస్సీ-2023 పోస్టుల వివరాలు కేటగిరీ పోస్టులు
స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) 1,739
సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) 2,575
లాంగ్వేజ్‌ పండితులు (ఎల్పీ) 611
ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఈటీ) 164
మొత్తం 5,089 జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోస్టులు
జిల్లా ఎస్‌ఏ ఎస్జీటీ ఎల్పీ పీఈటీ మొత్తం
1. ఆదిలాబాద్‌ 54 206 13 2 275
2. ఆసిఫాబాద్‌ 49 214 24 2 289
3. భద్రాద్రి కొత్తగూడెం 76 101 7 1 185
4. హన్మకొండ 21 21 5 7 54
5. హైదరాబాద్‌ 116 163 57 22 358
6. జగిత్యాల 50 53 37 8 148
7. జనగామ 23 29 17 7 76
8. జయశంకర్‌ 12 38 17 7 74
9. జోగులాంబ 34 77 27 8 146
10. కామారెడ్డి 97 86 12 5 200
11. కరీంనగర్‌ 22 52 18 7 99
12. ఖమ్మం 89 83 13 10 195
13. మహబూబాబాద్‌ 35 69 19 2 125
14. మహబూబ్‌నగర్‌ 23 47 19 7 96
15. మంచిర్యాల 36 58 16 3 113
16. మెదక్‌ 70 48 28 1 147
17. మేడ్చల్‌ 25 45 7 1 78
18. ములుగు 16 33 15 1 65
19. నాగర్‌కర్నూల్‌ 61 36 15 2 114
20. నల్లగొండ 86 102 25 6 219
21. నారాయణపేట 71 62 20 1 154
22. నిర్మల్‌ 16 91 4 4 115
23. నిజామాబాద్‌ 96 183 21 9 309
24. పెద్దపల్లి 30 7 5 1 43
25. రాజన్న సిరిసిల్ల 23 64 12 4 103
26. రంగారెడ్డి 48 117 25 6 196
27. సంగారెడ్డి 80 174 24 5 283
28. సిద్ధిపేట 60 49 24 8 141
29. సూర్యాపేట 80 78 23 4 185
30. వికారాబాద్‌ 102 77 12 0 191
31. వనపర్తి 43 19 9 5 76
32. వరంగల్‌ 56 55 21 6 138
33. యాదాద్రి 39 38 20 2 99
మొత్తం 1,739 2,575 611 164 5,089

Spread the love