అర్బన్ ఎమ్మెల్యేకి మధ్యాహ్న భోజన కార్మికుల వినతి

నవతెలంగాణ- కంటేశ్వర్:
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఏడవ రోజు ధర్నా చౌక్ లో నిరవధిక సమ్మె జరిగింది.
తమ సమస్యలు పరిష్కరించాలని నిజామాబాద్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గప్త ని కలవాడానికి వెళ్ళినప్పుడు కార్మికులను పోలీసులు అడ్డుకున్న కదలకుండా గంటల తరబడి ఎండలో వేసి ఉండి ఎమ్మెల్యే ని కలిసి వినతి పత్రం బుధవారం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు గౌరవ వేతనాలు గుర్తింపు కార్డులు, యూనిఫాంలు, ప్రమాద బీమా, సౌకర్యాలను కల్పించడం లేదని, ప్రభుత్వం ప్రవేశపెట్టే అల్పాహారం కి కూడా ఎటువంటి మెనూ చార్జీల ప్రతిపాదన బడ్జెట్ విడుదల చేయలేదని, దానివల్ల వంట చేయడం కష్టం అవుతుందని తెలియజేశారు, మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. కౌన్సిల్ నుండి బయటకు వచ్చి వినతి పత్రం తీసుకొని సమస్యలపై అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా  సానుకూలంగా స్పందించారు, త్వరలోనే మంత్రి  దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపజేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కటారి రాములు, అధ్యక్షురాలు చామంతి లక్ష్మి, నాయకులు నిరంజన, సురేందర్ రెడ్డి, బాలరాజు, పర్వవ్వ, శిరీష, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love