మధ్యాహ్న భోజన కార్మిక సమస్యలు పరిష్కరించాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం 

– 13వ రోజు సమ్మె….
నవతెలంగాణ- మద్నూర్
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్,( ఏఐటీయూసీ) *రాష్ట్ర ఉపాధ్యక్షులు తోపునూరు చక్రపాణి మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులతో ఈ ప్రభుత్వం ఎట్టి చాకిరి చేయిస్తా ఉన్నది 22 సంవత్సరాలు నుంచి గత పాలకులతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మా  బతుకులు  మారుతివి  అనుకున్నా తరుణంలో మధ్యాహ్న భోజన కార్మికులు  మానసిక ఆర్థిక ఒత్తిళ్లకు గురైనారు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని చెప్పి బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఈ కార్మికులను నిలువునా ముంచేసింది .ఈ ప్రభుత్వానికి ఒకటే మాట చెప్తున్నాము. ఈ రాష్ట్రంలో అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న శ్రమకు దోపిడి అవుతున్న కార్మికులు మధ్యాహ్న భోజన కార్మికులు మధ్యాహ్న భోజన కార్మికులకు 2000 రూపాయలు పెంచుతున్నామని చెప్పి సుమారు 2 సంవత్సర నుండి  ఊరిస్తా ఉన్నది ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేలు రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం కూడా 3000 రూపాయలు పెంచాలి. 40:60 నిష్పత్తి తో  పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది  కావున 3000 రూపాయలు పెంచాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ కార్మికులు సుమారు 6:30 గంటలు పని చేస్తా ఉన్నారు. పాఠశాలలో  తక్షణమే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.  మండల అధ్యక్షురాలు సావిత్రిబాయి, శాంతాబాయి, రుక్మిణి, మునీర్, విజయ్,  కార్మికులు పాల్గొన్నారు.
Spread the love